Happy Fathers Day Quotes in Telugu

 

Telugu-quotes-images-Mothers--day-Greetings-life-inspiration-quotes-greetings-Mothers--day-wishes-thoughts-sayings-free


నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. ఓ భద్రత, భరోసా.. అన్నింటికీ మించి త్యాగానికి మారుపేరు నాన్న. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు.

పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే నాన్న.. వాళ్లు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను గౌరవించుకోవాలనే భావనతో వచ్చిందే ‘ఫాదర్స్ డే’.

ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డేను నిర్వహించుకుంటారు. ఫాదర్స్ డే అంటే.. పూర్తిగా మీ తండ్రి కోసం కేటాయించే రోజు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా బెస్ట్ విషెస్, క్వోట్స్ మీ కోసం..

అంతకంటే ముందు.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు..

ఫాదర్స్ డే విషెస్..

నాన్నా.. ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి మీరు. మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి.. హ్యాపీ ఫాదర్స్ డే.

నాన్నా.. మీరే నా సూపర్ హీరో. ఐ లవ్యూ డాడీ.. హ్యాపీ ఫాదర్స్ డే!!

నాన్నా.. ఈ ప్రపంచంలో బెస్ట్ డాడీ మీరే. మిమ్మల్ని నాన్నగా పొందడం నా అదృష్టం. ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

నాన్నా.. నా బెస్ట్ ఫ్రెండ్ మీరే. నా మంచి, చెడు, ఆనందం, విజయం.. అన్నింటి వెనకా మీరే ఉన్నారు. నా కోసం ఎంతో త్యాగం చేశారు. పితృ దినోత్సవ శుభాకాంక్షలు నాన్నా..

నాన్నా.. నా మొట్టమొదటి గురువు, నా బెస్ట్ ఫ్రెండ్ మీరే.. హ్యాపీ ఫాదర్స్ డే.

 ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి, నీతికి నిదర్శనం... అన్నీ నాన్నే...


* గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకుని... ఓడినప్పుడు మన భుజంతట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి ... 'నాన్న' ఒక్కడే.

* ప్రేమని ఎలా చూపించాలో తెలియని వ్యక్తి 'నాన్న' ...

 * నీకు జన్మనే కాదు... భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే..   

 * బయటకి కనిపించే నాన్న కోపం వెనుక.. ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది...

 * నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు... సమాజంలో మంచి పేరుని కూడా ఇస్తాడు...

 * మనమెక్కిన తొలి విమానం... మన తండ్రి "భుజాలే!

 * నాన్న ప్రేమకి రూపం ఉండదు... భావం తప్ప!

 * నాన్న దండనలో ఒక ఒక హెచ్చరిక ఉంటుంది.. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది.

 * మన జీవితంలో చాలామంది స్ఫూర్తిదాతలు ఉండొచ్చు. కాని.. ఆ జాబితాలో తొలిపేరు మాత్రం 'నాన్నదే'

 * పిల్లలకి మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి... అన్ని 'నాన్నే'

 * నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు. కాని అపజయం మాత్రం ఉండదు.

 * జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో.. తండ్రి ఇచ్చే తోడ్పాటుకి వెలకట్టే 'సాధనం' ఇంకా కనుగొనలేదు.

 * ఓడిపోయినా సరే... చేసే ప్రయాణాన్ని ఆపవద్దు అని మనకి చెప్పే తొలి గురువు - 'నాన్న'.

 * మనకంటూ ఒక గుర్తింపు రాక మునుపే.. మనల్ని గుర్తించే వారిలో ప్రథముడు తండ్రి

 * మనకి తండ్రి విలు..వ మనం ఒక బిడ్డకి తండ్రి అయినప్పుడు కాని తెలియదు.

 * తల్లి తన మాటలతో పిల్లలో ధైర్యం నింపితే.. అదే ధైర్యాన్ని తండ్రి తన చేతలతో ఇవ్వగలుగుతాడు.

  * మనం జీవితంలో ఎప్పటికి మరవకూడని వ్యక్తుల్లో 'నాన్న' ఒకరు.

 * తొలి జీతం అందుకున్న రోజున.. మనకన్నా ఎక్కువగా ఆనందపడే వ్యక్తి 'నాన్న'

 * జీవితంలో ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోయినా సరే గుర్తుకి వచ్చే మాట 'నాన్న'.

* ‘‘ఈ విశ్వంలో కూతురు మరియు కుమారుడి యొక్క మొట్టమొదటి హీరో ఎవరైనా ఉన్నారంటే అది వారి నాన్న మాత్రమే''.

* ‘‘నాన్న ఊపిరి ఉన్నంత వరకు.. మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి జీవితాన్ని ధారపోసి మనకు జీవితాన్ని ఇస్తాడు''

* ‘‘మన ముందు కఠినంగా ఉండే నాన్న.. బయట వారితో.. ముఖ్యంగా బంధువులతో మన గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు..''

* ‘‘మనం తినే తిండి.. కట్టుకునే బట్ట.. చదివే చదువు.. తనవల్లే వచ్చాయని ఒక్కరోజు కూడా భావించని ప్రత్యక్ష దైవమే నాన్న''

* ‘‘మనలో ఆనందాన్ని నింపి.. అల్లారుముద్దుగా పెంచి.. మనలోని లోపాలను సరిచేస్తూ.. మన భవితకు పునాదులు వేస్తూ.. మన గమ్యానికి దారి చూపేది నాన్న''

* ‘‘అమ్మ దగ్గర ఉన్నంత ఫ్రీగా.. నాన్నతో ఉండలేము. నాన్నంటే భయపడుతూ ఉంటాం. ఏదైనా మాట్లాడినా 4 రకాలుగా ఆలోచిస్తాం.. అయితే మనం దారితప్పకూడదన్న ఉద్దేశమే నాన్నది‘‘

* ‘‘ జీవితంలో మనల్ని ముందుకు నడిపించి.. తాను మాత్రం వెనుక నుండి చేయూతనివ్వడమే.. ఏ తండ్రికైనా సంతోషం''

* ‘‘బయటి ప్రపంచాన్ని పరిచయం చేసేది... నలుగురితో ఎలా మెలగాలో నేర్పేది.. కేవలం ఒక్క నాన్న మాత్రమే''

* ‘‘తప్పటడుగులు వేయకుండా.. ఎప్పటికీ తడబడకుండా.. మనం ఎన్నటికీ తూలి పడకుండా.. వెంటే ఉండేవాడు నాన్న''

* ‘‘మనం గెలిచినప్పుడు అందరికీ చెప్పి.. మనం ఓడినప్పుడు మన భుజాన్ని తట్టి.. మళ్లీ గెలుస్తావులే అని ధైర్యం చెప్పేవాడే నాన్న''

* ‘‘మనం పుట్టిన నాటి నుండి పెరిగి పెద్దయ్యే వరకు మనల్ని తన భుజాలపై మోస్తూ ఈ లోకాన్ని మొట్టమొదటగా చూపించేది ఒక్క నాన్నే''

* ‘‘ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా.. ప్రపంచాన్ని సైతం ఎదిరించైనా.. నీకు అండగా ఉండేవాడే నాన్న''

* ‘‘అమ్మ ప్రేమను కళ్లతో చూడగలం.. కానీ ఒక్క నాన్న ప్రేమను మాత్రమే.. కన్నీళ్లతోనే తెలుసుకోగలం''

* ‘‘నాన్నంటే మరచిపోలేని జ్ణాపకం.. ఎందుకంటే మన తప్పులను సరిచేస్తూ.. మనం చేసిన మంచి పనులను ఎప్పుడు మెచ్చుకుంటూ.. ప్రతి క్షణం మన ఎదుగుదలనే ఆకాంక్షిస్తాడు''

* ‘‘ నా తొలి నేస్తం నాన్న.. నాకు తొలి అడుగు నేర్పింది నాన్న.. మన గెలుపును తనలో చూసుకునేవాడు నాన్న.. మన కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్చేవాడు నాన్న''

Post a Comment

0 Comments